Sunday, 6 November 2016

How to make Mosquitoes killer using old all out.

*☘దోమలను తరిమికొట్టడానికి ఇక All Out కొనాల్సిన పనిలేదు…పాత All Out రీఫిల్ ఉంటే చాలు.!*

డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా…. వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ జెట్ కాయిల్స్ ను కాల్చడమో ? ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు. అయితే చాలామందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. కొంత మంది ప్రతీసారి అంత అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్తోమతలో ఉండరు.  కారణం ఏదైనా వాటిని భరించడం తప్పట్లేదు. అయితే ఈ సారి మీరు All Out, Good Knight, Jet Coils లాంటివి కొనకుండా…. మీ ఇంటి మూలల్లో దాగిఉన్న  దోమలను తరిమికొట్టొచ్చు. దీని కోసం  All Out, Good Knight ల  పాత రీఫిల్ ఉంటే చాలు.

*🔹సహజ దోమల నివారిణిని ఎలా తయారు చేయాలి:*

*Step-1:* పాత All Out, Good Knight ల రిఫీల్స్ ను తీసుకొని వాటి మూతను తీసేయాలి.

*Step-2:* ఖాళీగా  ఉన్న రీఫిల్ లో….   3-4 పూజకు ఉపయోగించే కర్పూరం బిళ్లలు వేసి, అవి మునిగేటట్టు వేప నూనె పోయాలి( వేపనూనె అన్ని ఆయుర్వేద షాప్ లలో దొరుకుతుంది)

*Step-3:* ఇప్పుడు రీఫిల్ నుండి తీసిన మూతను ఫిక్స్ చేయాలి.

*Step-4:* సాధారణంగా రీఫిల్స్ ను ఎలా వాడుతామో…అలాగే వీటిని కూడా మెషిన్ లో ఫిక్స్ చేసి స్విచ్చ ఆన్ చేస్తే సరిపోతుంది.

*🌻మనం సొంతంగా తయారు చేసిన ఈ దోమల నివారిణి వల్ల కలిగే లాభాలు:*

🔹100% ఆరోగ్యహితమైనది, ఎటువంటి కెమికల్స్ కలపనటువంటిది.
🔸కర్పూరం వాసన కారణంగా శ్వాస చాలా ఫ్రీగా ఆడుతుంది.
🔹వేప నూనె వాసన వల్ల శరీరంలోని హానికర బ్యాక్టీరియా చనిపోతుంది.
🔸కృతిమ దోమ నివారిణుల వల్ల శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  🔹మనం తయారు చేసిన దాని వల్ల ఎటువంటి రోగాలు రావు. పైగా చిన్న పిల్లలున్న ఇంట్లో కూడా ఇది వాడొచ్చు.🌹

No comments:

Post a Comment